అఖిల్ కోసం బన్నీ చేసిన త్యాగమేంటి..?
on Sep 12, 2016

అఖిల్ సినిమా తర్వాత అఖిల్‌కి వరుస ఆఫర్లు వస్తాయని అంతా అనుకున్నారు. కాని బొమ్మ రివర్స్ కావడంతో అఖిల్‌కి ఛాన్సిచ్చే వారే కరువయ్యారు. దీనికి కారణం లేకపోలేదు..స్టార్ డైరెక్టర్లతో పాటు యంగ్ డైరెక్టర్లంతా బిజీగా ఉండటంతో అఖిల్‌కి కథ చెప్పేవారు లేరు. దీంతో రెండో సినిమా ఎప్పుడు చేస్తాడా అని అందరూ ఎదురుచూడసాగారు. ఈ నేపథ్యంలో అక్కినేని ఫ్యామిలీని సింగిల్ ఫ్రేమ్‌లో చూపిన డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్‌తో అఖిల్ రెండో సినిమా చేస్తున్నట్టు నాగార్జున ఇటీవలే ప్రకటించాడు. ఈ వార్తతో ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు.
ఎందుకంటే సూర్యతో 24 సినిమా చేసిన తర్వాత మహేశ్, అల్లు అర్జున్ వంటి స్టార్లతో విక్రమ్ సినిమా తీయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ బన్నీతో ఓ ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికి ప్లాన్ చేసుకున్నాడు కూడా. మరి ఇంత హఠాత్తుగా ఆ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లిపోయి అఖిల్ లైన్‌లోకి ఎలా వచ్చాడు. దీనికి కారణం స్టైలీస్ స్టార్ అల్లు అర్జున్ . విక్రమ్‌ని నాగార్జున పిలిచి కథ ఏదైనా ఉంటే చెప్పు, అఖిల్‌తో చేద్దాం అని అడిగారట. అయితే అప్పటికే విక్రమ్‌తో బన్నీ సినిమా కన్ఫార్మ్ కావడంతో..ఆ విషయమే నాగార్జునతో చెప్పి, బన్నీకి అభ్యంతరం లేకపోతే అఖిల్‌తో చేయడానికి నేను రెడీ అన్నాడట విక్రమ్. దీంతో నాగ్ బన్నీని సాయం చేయమని అడిగాడట. స్వయంగా నాగార్జున అడిగేసరికి కాదనలేకపోయిన బన్నీ..విక్రమ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుని అఖిల్‌కు ఆ ఛాన్సిచ్చాడు. కేవలం నాగార్జున మీదున్న గౌరవంతో టాలెంటెడ్ డైరెక్టర్‌తో వర్క్ చేసే చాన్స్ మిస్సయ్యాడు అర్జున్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



