లారెన్స్‌కు తీవ్ర అస్వస్థత..ఆస్పత్రికి తరలింపు
on Jan 23, 2017
.jpg)
నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కేంద్రప్రభుత్వం జల్లికట్టును నిషేధించడాన్ని నిరసిస్తూ చెన్నై మెరీనా బీచ్‌లో ఆందోళన నిర్వహిస్తున్న వారికి సంఘీభావంగా లారెన్స్ కూడా దీక్షలో పాల్గొన్నారు. అప్పటికే తీవ్ర మెడనొప్పితో బాధపడుతున్న ఆయన మెడకు పట్టీ పెట్టుకుని వచ్చారు. నొప్పిని ఒర్చుకుంటూ ప్రజల పక్షాన నిలబడ్డారు. మెరీనా బీచ్‌లో ఆందోళనలో పాల్గొన్న వారందరికి కోటీ రూపాయల విలువ చేసే ఆహారపదార్థాలు, నిత్యావసర వస్తువులు అందించారు..అయితే ఆరోగ్యం సహకరించకపోవడంతో వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు..అనంతరం చెన్నైలోని పల్లవి ఆసుపత్రిలో చేరారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



