దర్శకులకు మేస్త్రీ ఛాలెంజ్
on Jan 23, 2017

దర్శకరత్న దాసరి నారాయణరావు ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే ఆయన ఎవరిపై కారాలు మిరియాలు నూరుతారా..ఎవరిపై కామెంట్ చేస్తారోనని ఇండస్ట్రీ వాళ్లు భయపడతారు..కానీ మీడియా వారు మాత్రం ఆసక్తిగా ఎదురుచూస్తారు. వాళ్లు అనుకున్నట్లుగానే అలాంటి ఒక బాంబు పేల్చారు గురువుగారు. దాసరి నిర్మించిన అభిషేకం సీరియల్ ఏకంగా 2500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దర్శకులకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఏ టాప్ డైరెక్టర్ అయినా ఓ సీరియల్ తీసి వంద ఎపిసోడ్స్ నడిపిస్తే ఆ దర్శకుడికి పాదాభివందనం చేస్తానని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చకు దారి తీశాయి. మరి దాసరి కామెంట్స్‌కు ఎవరు బదులిస్తారో వేచి చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



