జై.. లవ.. కుశ.. ఎవరో తెలుసా??
on May 16, 2017

ఎన్టీఆర్ తన కెరీర్‌లో తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. జై లవకుశలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్ ఏయే పాత్రల్లో కనిపిస్తాడా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈమూడు పాత్రలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. జై అనేవాడు విలన్. లవ కుమార్ ఓ బ్యాంగు ఉద్యోగి. కుశ.. ఓ దొంగగా కనిపించబోతున్నాడు. ఈ మూడు పాత్రలకూ ఎక్కడ లింకు కుదిరిందన్నదే `జై లవకుశ`లో కీలకమైన పాయింట్ అని తెలుస్తోంది. ఈనెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు జరుపుకొంటున్నాడు.
దానికి ఒక్క రోజు ముందే `జై లవకుశ` ఫస్ట్ లుక్ బయటకు రాబోతోంది. ఫస్ట్ లుక్‌లోనే మూడు పాత్రల్నీ ఒకేసారి రివీల్ చేయబోతున్నారని తెలుస్తోంది. జై లవకుశలో ఎన్టీఆర్ క్లాసికల్ డాన్సర్‌గా కనిపించనున్నాడని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అందులో నిజం లేదని చిత్రబృందం ప్రకటించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



