యాక్షన్ కింగ్@150 విజయం దక్కేనా..!
on May 16, 2017

విభిన్నభాషా చిత్రాలతో తనకంటూ సరికొత్త స్థానాన్ని దక్కించుకొని ..తన పోరాట సన్నివేశాలతో ఆద్యంతం ఆకట్టుకునే మన యాక్షన్ కింగ్ అర్జున్ కథానాయకుడిగా 150 చిత్రాలను పూర్తిచేసుకోబోతున్నారు.ఆయన 'నిబునన్'అనే చిత్రంతో సందడిచేయనున్నారు.తాజాగా విడుదలైన టీజర్ ఆకర్షణీయంగా ఉండి,అభిమానులను ఆకట్టుకుంటుంది.అయితే 150 చిత్రాల హీరోగా సరికొత్త విజయాన్ని పొందిన చిరంజీవి సరసన అర్జున్ నిలిచారు.
ఇకపోతే ఈ చిత్రం ఎంతటి విజయాన్ని సంపాదిస్తుందో అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ప్రస్తుతం 150 అనే మార్క్ విజయానికి ప్రతీక గా చిరు విషయంలో నిలిచిన నేపథ్యంలో అదే స్థాయిలో ఈ చిత్రం నిలవనుందా అనేది ఆసక్తిగా మారింది.ప్రస్తుతం ఈ చిత్రం తమిళం.. కన్నడ భాషల్లో రానున్నది.తెలుగులో కూడా త్వరలో రానున్నట్లు తెలుస్తుంది. అరుణ్ వైద్యనాథన్ దర్శకత్వం లో ఈ చిత్రం తెరకెక్కింది.ప్రసన్న,వైభవ్ ,వరలక్ష్మి కీలక పాత్రల్లో నటించారు.అర్జున్ 150 వ చిత్రం ఎంతటి విజయాన్ని ఇస్తుందో వేచి చూద్దాం...
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



