కలర్‌ఫుల్ స్విమ్‌సూట్‌లో సెగలు రేపుతున్న 'మాస్టర్' హీరోయిన్!
on Feb 1, 2022
.webp)
గ్లామరస్ హీరోయిన్ మాళవికా మోహనన్ మాల్దీవుల వెకేషన్ నుంచి తన వంపుసొంపుల ఫొటోలతో మరోసారి ఇంటర్నెట్‌ను వేడెక్కించింది. ఆమె షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోలను చూసి ఫ్యాన్స్ వావ్ అనకుండా ఉండలేకపోతున్నారు. నియాన్ బికినీ సెట్ ధరించిన మాళవిక తన అందచందాలను ప్రదర్శిస్తూ ఇచ్చిన పోజును కళ్లప్పగించి చూస్తూ ఉండిపోతున్నారు నెటిజన్లు.
ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఫొటోల్లో.. కటౌట్ మోనోకినిలో ఉన్న ఆమెను చూస్తుంటే, బ్రహ్మదేవుడు కచ్చితమైన కొలతలతో ఆమెను భూమిపైకి పంపాడేమోనని అనిపించక మానదు. ఆ స్విమ్‌సూట్‌తో పాటు మెడలో వేలాడుతున్న గోల్డ్ కలర్ నెక్లెస్ ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తోంది. ప్రస్తుతం మాల్దీవుల్లో విహారయాత్రను గడుపుతున్న మాళవిక, అక్కడ్నుంచి స్టన్నింగ్ ఫొటోలను షేర్ చేస్తూ వస్తోంది. శనివారం కూడా, సముద్రం దగ్గర పింక్ మోనోకినిలో ఉన్న ఫొటోలతో అదరగొట్టిందామె.
.webp)
త్వరలో ఆమె తమిళ సినిమా 'మారన్'లో ధనుష్ సరసన కనిపించబోతోంది. కార్తీక్ నరేన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సముద్రకని, స్మృతి వెంకట్, కృష్ణకుమార్ బాలసుబ్రమణియన్, మహేంద్రన్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా థియేటర్లలో కాకుండా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో నేరుగా రిలీజ్ కానున్నది.
.webp)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



