తమన్నాపై ఎటాక్
on Jan 28, 2018
.jpg)
చేతిలో సినిమాలు లేకపోయినా సౌత్‌లో మిల్కీబ్యూటీ తమన్నా హవా నడుస్తూనే ఉంది. ఇప్పటికి దక్షిణాదిలోని టాప్-5 హీరోయిన్స్‌లో ఒకరిగా తమన్నా వెలుగొందుతోంది. అలాంటి తమన్నాకు హైదరాబాద్‌లో చేదు అనుభవం ఎదురైంది. నగరంలోని ఓ ప్రముఖ నగల దుకాణాన్ని ప్రారంభించడానికి హిమాయత్‌నగర్ వచ్చారు. ఆమెను చూడటానికి జనం బాగా గుమిగూడారు. ఈ సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి తమన్నాపై చెప్పు విసిరాడు. వెంటనే అప్రమత్తమైన వ్యక్తిగత సిబ్బంది ఆమెకు రక్షణగా నిలిచారు. కాగా, చెప్పు విసిరిన వ్యక్తిని కరీముద్దీన్‌గా గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే తమన్నాపై అతను ఎందుకు చెప్పు విసిరాడో తెలియరాలేదు. ప్రస్తుతం తమన్నా క్వీన్ తెలుగు రీమేక్‌లోనూ.. నా నువ్వేలో కళ్యాణ్‌రామ్ సరసన నటిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



