భారత్ 151/7.. విరాట్ హాఫ్ సెంచరీ, రోహిత్ డకౌట్!
on Oct 24, 2021

దుబాయ్‌లో జరిగిన గ్రూప్ 2 మ్యాచ్‌లో ప్రత్యర్థి పాకిస్తాన్‌పై భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (49 బాల్స్‌లో 57 రన్స్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో బాధ్యతాయుతంగా ఆడగా, వైస్ కెప్టెన్ రోహిత్ ఆడిన తొలి బంతికే ఎల్బీ అయి డకౌట్‌గా వెనుతిరిగాడు. ఓపెనర్ కె.ఎల్. రాహుల్ (3) సైతం నిరాశపర్చాడు. ఓపెనర్లు ఇద్దరినీ పాక్ టాప్ బౌలర్ షహీన్ షా అఫ్రిది పెవిలియన్‌కు పంపాడు. ఫస్ట్ స్పెల్‌లో నిప్పులు చెరిగే బంతులతో భారత్ శిబిరంలో ఆందోళన నింపాడు అఫ్రిది.
నాలుగో నంబర్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన సూర్యకుమార్ యాదవ్ ఉన్న కాసేపు బెదురు లేకుండా ఆడి, ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టాడు. విరాట్, సూర్యకుమార్ కుదురుకుంటున్నారని అభిమానులు ఆశపడుతున్న సమయంలో సూర్యను ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ ఔట్ చేశాడు. అనంతరం వచ్చిన రిషభ్ పంత్ తన వంతు బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు. నాలుగో వికెట్‌కు విరాట్, రిషభ్ 37 బంతుల్లో 50 పరుగులు చేశారు. చివరకు 30 బంతుల్లో 39 రన్స్ చేసి బౌలర్ షాదాబ్ ఖాన్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు రిషభ్. అతడి స్కోరులో 2 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.
ఒకవైపు వికెట్లు పడుతున్నా సంయమనంతో ఆడుతూ వచ్చిన విరాట్ 45 బాల్స్‌లో 50 రన్స్ పూర్తి చేశాడు. అయితే 19వ ఓవర్‌లో ఆరవ వికెట్‌గా వెనుతిరిగాడు. అతడిని కూడా అఫ్రదియే ఔట్ చేశాడు. టైల్ ఎండర్స్ అండతో భారత్ 150 పరుగులను దాటింది. పాక్ బౌలర్లలో అఫ్రిది 3, హసన్ అలీ 2, షాదాబ్ ఖాన్ 1, రౌఫ్ 1 వికెట్ పడగొట్టారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



