'ఆర్ఆర్ఆర్'తో పాటు టాప్-10 లో 'మేజర్', 'సీతారామం'
on Dec 14, 2022

'ఆర్ఆర్ఆర్' ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంచలనాలు సృష్టించింది. తాజాగా ఈ చిత్రం మరో ఘనతను సాధించింది. 2022 సంవత్సరానికి గాను ఐఎండీబీ ప్రకటించిన టాప్-10 మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాల లిస్టులో 'ఆర్ఆర్ఆర్' అగ్రస్థానం కైవసం చేసుకుంది. 'ఆర్ఆర్ఆర్'తో పాటు మరో రెండు తెలుగు సినిమాలు టాప్-10 లో చోటు దక్కించుకున్నాయి.
ఐఎండీబీ ప్రకటించిన టాప్-10 మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాలలో 'ఆర్ఆర్ఆర్' మొదటి స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో 'ది కాశ్మీర్ ఫైల్స్', మూడో స్థానంలో 'కేజీఎఫ్ చాప్టర్-2' నిలిచాయి. 'విక్రమ్', 'కాంతారా', 'రాకెట్రీ', 'మేజర్', 'సీతారామం', 'పొన్నియన్ సెల్వన్-1', '777 చార్లీ' ఆ తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి. పాపులారిటీ పరంగా '777 చార్లీ' పదో స్థానంలో నిలిచినప్పటికీ.. రేటింగ్ పరంగా మాత్రం 8.9తో టాప్ లో ఉంది. ఒక్క 'పొన్నియన్ సెల్వన్-1'(7.9) మినహా టాప్-10 మోస్ట్ పాపులర్ లిస్టులో ఉన్న సినిమాలన్నీ 'ఆర్ఆర్ఆర్'(8.0) కంటే ఎక్కువ రేటింగ్ సాధించడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



