'ఆకాశవీధిలో ఎగిరిపోదామా' అంటున్న రాకేష్, సుజాత!
on Dec 14, 2022

జబర్దస్త్ లో రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదట్లో ఇద్దరిదీ రీల్ జోడి అనుకున్నారు కానీ తర్వాత రియల్ జోడి అని అర్ధమయ్యింది. ఇద్దరూ ఒక షోలో రింగ్ పెట్టుకుని ప్రొపోజ్ కూడా చేసుకున్నారు. చాలా షోస్ లో కూడా ఇద్దరూ రియల్ భార్యాభర్తల మాదిరిగా అటెండ్ అవుతూ ఉంటారు. రీసెంట్ గా యాదమ్మ రాజు పెళ్లి వేడుకలకు కూడా వచ్చారు. ఇక మరో విషయం చూస్తే ఇప్పుడు కొంచెం టైం దొరికినట్టుగా ఉంది. స్మాల్ స్క్రీన్ సెలెబ్స్ అంటా సముద్రాలు, బీచ్ లు అంటుంటే వీళ్ళు మాత్రం ప్యారాచూట్ రైడ్ చేసి ఫుల్ ఎంజాయ్ చేశారు.
పారాగ్లైడర్ ద్వారా రాకేష్, సుజాత అలా ఆకాశంలో ఎగిరెళ్ళిపోయారు. ఆ వీడియోని, ఫొటోస్ ని తమ ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. దీనికి "ఆకాశవీధిలో" అని కాప్షన్ పెట్టాడు రాకేష్. ఇక త్వరలోనే తాము పెళ్లి చేసుకుబోతున్నాం అని చెప్పేసరికి ఆడియన్స్ కూడా వీళ్ళ మ్యారేజ్ ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నారు. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన జోర్దార్ వార్తలు చదివే సుజాత బిగ్‌బాస్ సీజన్-4లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ షోతో సుజాత ఫుల్ ఫేమస్ ఐపోయింది. ప్రస్తుతం అన్ని రకాల టీవీ షోస్ లో పార్టిసిపేట్ చేస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



