ఇళయరాజా ఆ సినిమా చేయడం లేదు
on Mar 4, 2020

వ్యవసాయ నేపథ్యంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం 'కడైసి వివసాయి'. ప్రస్తుతం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయి. సినిమా ప్రారంభమైనప్పుడు ఇళయరాజా సంగీత దర్శకుడు. ప్రారంభమైనప్పుడు అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే... ఇప్పుడీ చిత్రానికి సంగీత జ్ఞాని ఇళయరాజా పని చేయడం లేదు. దర్శకుడితో అభిప్రాయ భేదాలు రావడంతో సినిమా నుండి తప్పుకున్నారని చెన్నై సమాచారం.
'కడైసి వివసాయి' సినిమా పోస్టర్, ట్రైలర్ లో సంగీత దర్శకుడిగా ఇళయరాజా పేరు వేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... ఇప్పుడు చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి మణికందన్ దర్శకుడు. ఆయన గతంలో దర్శకత్వం వహించిన ఓ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఒకసారి కలిసి పనిచేసిన అనుభవం ఉండడంతో తాజా చిత్రానికి పనిచేయాలని కోరారు. కొన్ని నెలల క్రితం ఇద్దరి మధ్య సంగీత చర్చలు ప్రారంభమయ్యాయి. కానీ, పాటల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. అందుకని, ఇళయరాజా ను కాదని సంతోష్ నారాయణన్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



