పెళ్లి తర్వాత నటిస్తే తప్పేంటి?
on Mar 4, 2020
పెళ్లి తర్వాత నటిస్తే తప్పేంటి? అని కరీనా కపూర్ ఖాన్ ప్రశ్నిస్తున్నారు. ‘మ్యారీడ్ హీరోయిన్’గా ఉండడంలో అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదని ఆమె సెలవిచ్చారు. పెళ్లయ్యాక నటించడం తప్పు కాదని పేర్కొన్నారు. పెళ్లై, ఓ పిల్లాడికి జన్మ ఇచ్చిన తర్వాత కూడా కరీనా ఫిగర్లో పెద్దగా మార్పులేమీ రాలేదు. ఇంకా చెప్పాలంటే కొత్త వచ్చిన హీరోయిన్లు కుళ్లుకునేలా కత్తిలాంటి ఫిజిక్‌తో కుర్రకారు మతులు పోగొడుతున్నారు. పెళ్లి తర్వాత మరింత హాట్‌గా కనిపిస్తున్నారు. ప్రేక్షకులు పెళ్లైన హీరోయిన్లను ఆదరిస్తున్నారని కరీనా కపూర్ ఖాన్ చెబుతున్నారు.
‘‘అదృష్టవశాత్తూ... పెళ్లైన హీరోయిన్లను చాలామంది దర్శకులు సపోర్ట్ చేస్తున్నారు. కబీర్ ఖాన్, ఆర్. బల్కి తదితర దర్శకులతో పెళ్లి తర్వాత నేను పని చేశా. బాలీవుడ్లో పెళ్లి కాని హీరోయిన్లు మాత్రమే కావాలనేది ఒక భావన. అంతే. కాలంతో పాటు చాలా మార్పులు వచ్చాయి. విద్యా బాలన్, కంగనా రనౌత్ తదితర హీరోయిన్లు హద్దులు చెరిపేసి డిఫరెంట్ రోల్స్ చేస్తున్నారు’’ అని కరీనా కపూర్ అన్నారు.
ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘అంగ్రేజీ మీడియమ్’లో పోలీస్‌గా కరీనా నటించారు. మార్చి 20న ఆ సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే ఆమిర్ ఖాన్ సరసన ‘లాల్ సింగ్ చద్దా’లో హీరోయిన్గా నటిస్తున్నారు.