'కాశ్మీర్ ఫైల్స్'పై షాకింగ్ కామెంట్స్.. అదొక వల్గర్ మూవీ!
on Nov 29, 2022

1990లలో కాశ్మీర్ పండిట్లపై జరిగిన దాడుల నేపథ్యంలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన చిత్రం 'ది కాశ్మీర్ ఫైల్స్'. మార్చిలో విడుదలైన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఘన విజయాన్ని అందుకుంది. ప్రేక్షకుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని తాజాగా గోవాలో జరిగిన 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా'(IFFI)లో ప్రదర్శించారు. అయితే ఇదొక వల్గర్ మూవీ అని, ఇది చిత్రోత్సవంలో ప్రదర్శించదగ్గ చిత్రం కాదంటూ జ్యూరీ హెడ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
చిన్న చిత్రంగా విడుదలై సంచలన విజయాన్ని అందుకొని ఎందరో ప్రశంసలు అందుకున్న 'కాశ్మీర్ ఫైల్స్'ని వల్గర్ మూవీ అనడం వివాదాస్పమైంది. గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో 'కాశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని ప్రదర్శించడం పట్ల జ్యూరీ అధినేత, ఇజ్రాయెల్ దర్శకుడు నడవ్ లాపిడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. "ఇదొక అసభ్యకర సినిమా. ప్రాపగాండాతో ఈ చిత్రాన్నితీశారు. ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రోత్సవంలో ప్రదర్శించాల్సిన సినిమా కాదు" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
లాపిడ్ చేసిన వ్యాఖ్యలను ఇజ్రాయెల్ రాయబారి గిలాన్ కూడా తప్పుబట్టారు. చారిత్రక ఘటనల గురించి పూర్తిగా తెలుసుకోకుండా లాపిడ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఇజ్రాయెల్ దేశస్థుడిగా సిగ్గుపడుతున్నానన్న ఆయన భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



