ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ముందు 'హంట్' మూవీ టీం నిరసన!
on Oct 29, 2022

'హంట్' టైటిల్ వివాదం రోజురోజుకి ముదురుతోంది. భవ్య క్రియేషన్స్ లో సుధీర్ బాబు హీరోగా రూపొందుతోన్న చిత్రానికి 'హంట్' అనే టైటిల్ ప్రకటించారు. అయితే 'హంట్' టైటిల్ ని తామే ముందుగా రిజిస్టర్ చేసుకున్నామంటూ శ్రీ క్రియేషన్స్ బ్యానర్ కొద్దిరోజులుగా న్యాయ పోరాటం చేస్తోంది. టైటిల్ మాది అంటూ ఇటు శ్రీ క్రియేషన్స్, అటు భవ్య క్రియేషన్స్ వాదనలు వినిపిస్తున్నప్పటి.. భవ్య క్రియేషన్స్ వారికి టైటిల్ ఆమోదం చేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి వ్యతిరేకంగా నిరసన వ్యక్త పరుస్తూ 'హంట్' సినిమా టీం వినతి పత్రాన్ని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్రెజరర్ తుమ్మలపల్లి రామసత్యనారాయణకి అందచేశారు.
ఈ సందర్భంగా హీరో, డైరెక్టర్ నిక్షిత్ మాట్లాడుతూ.. "మాకు న్యాయం జరగాలి అని లీగల్ గా నోటీసులు సైతం పంపించాము, కౌన్సిల్ నుండి, భవ్య క్రియేషన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఈ రోజు మేము నిరసన వ్యక్తం చేయాల్సి వచ్చింది, మా టైటిల్ మాకు వచ్చే అంత వరకు న్యాయ పరమైన పోరాటం చేస్తాం, నిరాహారదీక్ష కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం" అన్నారు.
ఎం.ఎస్.ఆర్ట్స్ స్టూడియో తరపున తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ.. "తప్పు జరుగుతున్నప్పుడు చూస్తూ ఉండడం కూడా పెద్ద తప్పు. ఒక్క టైటిల్ ని ఇద్దరికి ఇవ్వడం వలన ఈ సమస్య వచ్చింది. కావున ఈ సమస్య కి త్వరగా పరిష్కారం దొరకాలని ట్రెజరర్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారిని కోరుతున్నాం." అన్నారు.
నిర్మాతల మండలి ట్రెజరర్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. "వినతిపత్రం చూసాను, ఏ నిర్మాతకు అన్యాయం జరగకూడదు అనేది మా ఆశయం. ఒకే టైటిల్ ఇద్దరి నిర్మాతలకు ఇవ్వడం మాత్రం తప్పే.. తప్పు ఎక్కడ జరిగింది అనే అంశంపై అందరితో చర్చించి ఈ సమస్యని పరిష్కరిస్తాం." అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



