మొదలైన సర్దార్ బ్లాక్ మార్కెట్ రచ్చ
on Apr 4, 2016

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకున్న క్రేజ్ అలాంటి ఇలాంటిది కాదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానుల్లోనూ, ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలుంటాయి. రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వగానే అంతకు ముందు నుంచే టిక్కెట్స్ అడ్వాన్స్ బుకింగ్ కోసం థీయేటర్లలోనూ, ఆన్‌లైన్‌లోనూ అభిమానులు క్యూ కడతారు. అభిమానుల ఉత్సాహన్ని క్యాష్ చేసుకోవడానికి అంతే రేంజ్‌లో బ్లాక్ మార్కెట్ మాఫియా కూడా రెడీ అవుతుంది. తాజాగా పవన్ కళ్యాణ్, కాజల్ జంటగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సర్దార్ గబ్బర్ సింగ్ ఉగాది కానుకగా ఈ నెల 8న థియేటర్లలోకి వస్తోంది. పండగ దానికి తోడు వారంతం కావడంతో టిక్కెట్స్ కోసం విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఇప్పటికే ఫస్ట్ డే అన్ని షోల బుకింగ్స్ ఫుల్లయిపోయాయి. అయితే ఆన్‌లైన్‌లో టిక్కెట్స్ ముందుగానే కొనుగోలు చేసి..బ్లాక్ మార్కెట్ మాయ గాళ్లు టిక్కెట్స్ బ్లాక్ చేసినట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేస్తే ప్రింట్ థియేటర్ దగ్గర తీసుకోవడం బ్లాక్ మార్కెట్ మాఫియాకి కలిసి వస్తోంది. అందుకే ముందే టికెట్స్ బుక్ చేసి కావాల్సిన వారికి 1000 నుంచి 5000 వరకూ అమ్ముతున్నారంటే డిమాండ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, గుంటూరు, నెల్లూరు నగరాల్లో ఈ బ్లాక్ మాఫియా తన సామ్రాజ్యాన్ని విస్తరించినా ప్రధానంగా హైదరాబాద్‌పై ఫోకస్ ఎక్కువ చేసినట్టు కనిపిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



