నెగటివ్ రోల్‌లో తమన్నా!
on Aug 27, 2020

విజయ్, ఎ.ఆర్. మురుగదాస్ కాంబినేషన్‌లో త్వరలో ఓ సినిమా ప్రారంభం కానున్నది. ఇందులో తమన్నా నాయికగా నటిస్తోందని ఇదివరకు వార్తలు వచ్చాయి. కోలీవుడ్‌లో తాజాగా వినిపిస్తున్న దాని ప్రకారం తమన్నా క్యారెక్టర్ నెగటివ్ షేడ్‌తో ఉంటుందంట. పదేళ్ల తర్వాత విజయ్, తమన్నా కలిసి నటించబోతున్న సినిమా ఇది. ఇదివరకు వారి కలయికలో 'సుర' సినిమా వచ్చింది. విజయ్ ఇమేజ్‌ను మరింతగా పెంచిన 'తుపాకి' మూవీకి సీక్వెల్‌గా మురుగదాస్ ఇప్పుడు సినిమా ప్లాన్ చేశాడు. ఇందులో పైకి అమాయకంగా కనిపిస్తూ, వెనుక నేరాలు చేసే లేడీ క్యారెక్టర్‌ను ఆయన డిజైన్ చేశాడనీ, ఆ క్యారెక్టర్‌నే తమన్నా చేయనున్నదనీ ప్రచారంలోకి వచ్చింది.
విజయ్, మురుగదాస్ కాంబినేషన్‌లో ఇదివరకు 'తుపాకి'తో పాటు 'కత్తి', 'సర్కార్' వంటి సూపర్ హిట్లు వచ్చాయి. 'తుపాకి 2' కూడా యాక్షన్ ఎంటర్‌టైనర్ జానర్‌లోనే ఉంటుంది. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో విజయ్ నటించిన 'మాస్టర్' మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. థియేటర్లు తెరుచుకోగానే దాన్ని విడుదల చేయనున్నారు. ఈలోగా 'తుపాకి 2' మూవీ షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమాతో ఓ కొత్త తమన్నాను మనం చూడబోతున్నామన్న మాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



