అరుదైన గాయకుడు ఎ.ఎం. రాజా గురించి మీకేం తెలుసు?
on Sep 28, 2020

1954, 1955 సంవత్సరాల్లో తెలుగునాట వీరవిహారం చేసింది ఎ.ఎం. రాజా గాత్రం. 'విప్రనారాయణ'లోని మధురమధురమీ చల్లనిరేయి, పాలించరా రంగా, 'చక్రపాణి' చిత్రంలోని ఓ ప్రియురాలా.. ఓ జవరాలా, 'ప్రేమలేఖలు' సినిమాలోని విధి రాకాసి, నీవెవ్వరివో, రారాదా మది నిన్నే పిలిచెగాదా, 'మిస్సమ్మ'లోని బృందావనమది అందరిది, రావోయి చందమామ పాటలు రాజా స్వరమాధుర్యానికి కొన్ని మచ్చుతునకలు.
ప్రముఖ గాయని జి. కృష్ణవేణిని వివాహం చేసుకున్న సమయంలో వీరిద్దరూ పాడిన 'ప్రేమలేఖలు' ఘన విజయం సాధించడం ఓ విశేషం. రాజా సరదాగా నటించి, పాడిన కామెడీ ఫిల్మ్ 'పక్కింటి అమ్మాయి'. అశ్వత్థామ సంగీతం సమకూర్చిన ఆ చిత్రంలోని పాటలు హాయిగొలిపే లలితగాన మాధుర్యానికి సంకేతాలు. అలాగే అమర సందేశం పాటలు కూడా రాజా ప్రతిభని నిరూపించాయి.
'శోభ', 'పెళ్ళి కానుక' చిత్రాలకు రాజా సంగీత దర్శకత్వం వహించారు. పెళ్ళి కానుకలోని నేపథ్యం సంగీతం కూడా ఎంతో భావగర్భితంగా ఉండి సినిమా విజయానికి దోహదం చేసిందని చెప్పాలి. అందులోని పాటలు సరేసరి. తెలుగు నేపథ్య గాయకుల్లో ఎ.ఎం. రాజాది ఓ ప్రత్యేక స్థానం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



