రాజశేఖర్‌తో 'యముడికి మొగుడు' భామ?
on Sep 28, 2020

త్వరలో కొత్త సినిమా చిత్రీకరణ ప్రారంభించడానికి యాంగ్రీ స్టార్ రాజశేఖర్ రెడీ అవుతున్నారు. నీలకంఠ దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మలయాళంలో మంచి విజయం సాధించిన 'జోసెఫ్'కి ఈ సినిమా రీమేక్. కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ త్వరలో సెట్స్ మీదకు వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారట. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్‌ని సెలెక్ట్ చేశారట.
అల్లరి నరేష్ సరసన కథానాయికగా 'యముడికి మొగుడు'లో యమధర్మరాజు కుమార్తెగా నటించిన రిచా పనయ్ గుర్తుందా? తరవాత సునీల్ 'ఈడు గోల్డ్ ఎహే'లోనూ నటించింది. నీలకంఠ సినిమాలో రాజశేఖర్ సరసన ఆ అమ్మాయి నటించనున్నదని సమాచారం. మాజీ భార్య మరణం తరవాత క్రిమినల్ కేసులు ఎదుర్కొన్న రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రాజశేఖర్ కనిపించనున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మలయాళ కథలో మార్పులు, చేర్పులు చేశారట. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగులో జరుగుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



