దేవి ఎలిమినేషన్.. కంటెస్టెంట్ల కన్నీటితో తడిసిన హౌస్!
on Sep 28, 2020

బిగ్ బాస్ సీజన్ 4 లో ఎపిసోడ్ 22లో ప్రేక్షకులు ఊహించని మలుపు. బిగ్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న యాంకర్ నాగవల్లి దేవి ఎలిమినేట్ అయ్యారు. మూడోవారం ముచ్చటగా సాగుతుంది అనుకున్న తరుణంలో వీకెండ్ షోలో కంటెస్టెంట్లతో ఆటలాడించి, పాటలు పాడించిన నాగార్జున చివరికి అందరినీ కంటతడి పెట్టించారు. అన్ని టాస్క్ ల్లో ఎంతో బాగా ఆడుతూ తన డాన్స్ లతో దేవిలోని యాక్టీవ్, స్పోర్టివ్ కోణాన్ని పరిచయం చేశారు. హౌస్ లోకి అడుగుపెట్టేటప్పుడే "నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను అవుతాను, బిగ్ బాస్ టైటిల్ గెలవడానికే వచ్చాను" అని చెప్పిన దేవి నిజానికి కూడా అలాగే ఆడారు పాడారు. కరాటే కళ్యాణి హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతూ దేవిని నామినేట్ చేస్తూ బిగ్ బాంబ్ వేసింది. దాంతో ఎలిమినేషన్ జాబితాలో దేవి చేరింది. ప్రేక్షకుల మద్దతు తనకు ఉందని విశ్వసించిన ఆమె బిగ్ హౌస్ నుంచి మూడోవారమే బయటకు వస్తానని అసలు ఊహించలేదు. దాంతో ఆమె షాక్ అయ్యారు. మూడువారాల అనుబంధంతో ఇంటిసభ్యులంతా ముఖ్యంగా అరియానా, అఖిల్, అమ్మ రాజశేఖర్, సొహైల్, మోహబూబ్, మోనాల్ కంటతడిపెట్టారు.
వైల్డ్ కార్డు ఎంట్రీతో హౌస్ లో అడుగుపెట్టిన కుమార్ సాయి టాస్క్ ల్లోనూ వెనకబడటం, హౌస్ లో ఎవరితో ఎక్కువగా కలవపోవడంతో ఇంటి సభ్యులకు అతనిపై నెగిటివ్ అభిప్రాయమే ఉంది. అందరూ కుమార్ సాయి ఇంటిదారి పడ్డడం ఖాయం అనుకున్నారు. కానీ, దేవి, కుమార్ సాయి మధ్య పెట్టిన టాస్క్ లో కుమార్ సాయి గెలిచాడు. దాంతో అతను సేఫ్ అయ్యాడు. దేవి ఎలిమినేటెడ్ అని చెప్పగానే అరియానా దేవిని హంగ్ చేసుకుని భోరున ఏడ్చేసింది. నోయల్, అఖిల్, మెహబూబ్, మోనాల్ కూడా కంటతడి పెట్టారు. దేవి తన శత్రువు అని కామెంట్ చేసిన అమ్మ రాజశేఖర్ దేవిని పట్టుకుని "మీరు బాధపడవద్దు" అంటూ కంటతడి పెట్టుకుంటునే ఆమెను ఓదార్చారు. గంగవ్వ కాళ్లకు దండం పెట్టి ఇంట్లో నుంచి దేవి వెళ్లిపోతుంటే మోనాల్ ఆమెకు నీళ్లగ్లాసు అందించింది.
హౌస్ నుంచి బయటకు వచ్చిన దేవితో నాగార్జున మరో గేమ్ ఆడించారు. ఆమెకు ఒక్కో వస్తువును ఇస్తూ ఒక్కో కంటెస్టెంటుకు అంకితం చేయాలన్నారు. కొరడాను అఖిల్ కు, ఇటుకను అభిజిత్ కు, చెత్తబుట్టను అరియానాకు, సబ్బును దివికి, కెమెరాను సుజాతకు అంకితం ఇచ్చారు దేవి. ప్రతిదీ ఆమె పాజిటివ్ గానే చెప్పడంతో "సరే హౌస్ లోని వారిపై నీ అభిప్రాయం చెప్పు" అని నాగార్జున అడిగారు. "నీ ఆశయానికి కట్టుబడి ఉండు" అంటూ అఖిల్ కు, "హెల్దీ కామెడీని అందించు" అంటూ అవినాష్ కు, "అవకాశం వచ్చినప్పడు భయపడకుండా ఉపయోగించుకో" అంటూ కుమార్ సాయికి, "గేమ్ ను గేమ్ లా ఆడండి" అంటూ నోయల్ కు.. ఇలా అందరి గురించి దేవి చెప్తున్నప్పుడు అందరూ కంటతడి పెట్టారు.
అరియానా మరింత ఎమోషన్ అవుతూ "నాకు ఇలాంటి అక్క కావాలనుకున్నాను" అంటూ మరోసారి ఏడ్చేసింది. బిగ్ బాంబ్ వేసే అవకాశం నాగ్ ఇవ్వగా పాజిటివ్ గా కావాలని అరియానా పేరు చెప్పారు దేవి. దాంతో అరియానా కు నెక్ట్స్ వీక్ ఎలిమినేషన్ లేదని నాగ్ ప్రకటించారు. మోహబూబ్ "అక్క నాకు పాట నేర్పిస్తాను" అని మాటిచ్చావు అనగానే.. నాగ్ కూడా పాటపాడాల్సిందే అన్నారు. దాంతో దేవి బాధాతప్తహృదయంతో "నువ్వుంటే నా జతగా.." పాటపాడి మరోసారి కంటెస్టెంట్ల కంట తడి పెట్టించారు. వారందరి జత వీడి ఇంటిదారి పట్టారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



