ఆ హీరోకు మతిస్థిమితం ఎందుకు తప్పింది..?
on May 12, 2016

సినీ రంగం చాలా చిత్రమైనది. మెట్లూ ఎక్కిస్తుంది..పాతాళానికి తొక్కేస్తుంది. విజయాలకు పొంగిపోకుండా, అవకాశాలు రాలేదని కుంగిపోకుండా ఉన్నవాళ్లే ఇక్కడ నెగ్గుకొస్తారు. సినిమాల మీద పిచ్చితో హైదరాబాద్ చేరుకుని కష్టపడి ఒక సినిమాలో అవకాశం దక్కించుకున్నాడు ఉదయ్ కిరణ్ అనే కుర్రాడు. ఫేస్ బుక్ అన్న పేరుతో రిలీజైన ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా, అతనికి సినిమా రంగం గురించి అవగాహన వచ్చేలా చేసింది. ఆ తర్వాత మరిన్ని ప్రయత్నాలు చేస్తే పైకొచ్చేవాడే. కానీ చెడు సావాసాలు అతని ఎదుగుదలను అడ్డుకున్నాయి. డ్రగ్స్, లిక్కర్ కు బానిసయ్యాడు. పబ్స్ లో తాగి చిందులేయడం, అక్కడ జనం మీద చేయి చేసుకోవడం, అసభ్యంగా ప్రవర్తించడం లాంటివి చేసి రెండు మూడు సార్లు అరెస్ట్ అయ్యాడు. కానీ మార్పు మాత్రం రాలేదు. జైలుకు తరలించిన తర్వాత మందు, డ్రగ్స్ దొరక్కపోవడంతో మతిస్థిమితాన్ని కోల్పోయాడు. దీంతో అతన్ని ఎర్రగడ్డ హాస్పిటల్ కు తరలించారు. చెడు సావాసాలు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో, టాలెంట్ ఉన్నా సరైన దారిలో వెళ్లకపోతే చివరకు పరిస్థితి ఎంత అగమ్యగోచరంగా మారుతుందో తెలియజెప్పడానికి ఉదయ్ కిరణ్ ఒక ఉదాహరణగా మారాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



