చిరంజీవితో డ్యాన్స్..నక్క తోక తొక్కిన రెజీనా..!
on May 12, 2016

గ్లామర్ ప్లస్ యాక్టింగ్ టాలెంట్ ఉన్నా అవకాశాలు దక్కని భామల్లో రెజీనా ముందు వరసలో ఉంటుంది. మెగా హీరోయిన్ గా పేరు తెచ్చుకుని, వరసగా మెగా కుర్రహీరోలతో జతకట్టినా ఈ భామకు సరైన అవకాశాలు మాత్రం రాలేదు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తర్వాత సౌఖ్యం, శౌర్య సినిమాల్లో కనబడినా, సినిమాలు ఆడకపోవడంతో ఈ అమ్మడికి కూడా గుర్తింపు పెరగలేదు. కానీ మెగా హీరోయిన్ అన్న ఒక్కపేరు మాత్రం రెజీనాను కొద్దో గొప్పో లైమ్ లైట్ లో ఉంచుతోంది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చూసిన మెగాస్టార్ కు రెజీనా డ్యాన్స్ లు మెగాస్టార్ చిరుకు బాగా నచ్చాయట. తన పక్కన డ్యాన్స్ వేయాలంటే ఆ మాత్రం స్పీడ్ ఉండాలని భావించిన చిరు, రెజీనా కు తన 150 వ సినిమాలో ఐటెం సాంగ్ లో అవకాశం ఇచ్చారని సమాచారం. చిరు ల్యాండ్ మార్క్ సినిమా కనబడాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఐటెం సాంగ్ డ్యాన్స్, అది కూడా చిరంజీవి పక్కన అంటే, రెజీనా నక్కతోక తొక్కినట్టే అంటున్నారు సినీ జనాలు. కాగా హీరోయిన్ గా ఎవరో ఇంకా ఖరారు కానప్పటికీ, ఐటెం గర్ల్ ను మాత్రం ఫైనల్ చేసేయడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



