అనుష్క భాగమతి కథ అది కాదు..!
on May 12, 2016
.jpg)
అనుష్క హీరోయిన్ గా భాగమతి అనే సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. లేడీ ఓరియెంటెండ్ సినిమాగా తీస్తున్న ఈ సినిమా చారిత్రక కథాంశం అని, హైదరాబాద్ సిటీ ఏర్పడటానికి కారణమైన భాగ్యమతీ దేవి జీవిత చరిత్ర అని వార్తలు వచ్చాయి. పైగా అరుంధతి లాంటి సినిమాలో చేసిన అనుష్కను ఈ పాత్రకు తీసుకోవడంతో ఇదేదో భారీ సినిమాయే అని జనాలందరూ ఫిక్సైపోయారు. అయితే సినిమా దర్శకుడు అశోక్ అసలు విషయాన్ని క్లియర్ గా చేప్పేశాడు. భాగమతి పూర్తి కమర్షియల్ ఎంటర్ టైనర్ అని, థ్రిల్లింగ్ సబ్జెక్ట్ తో తెరకెక్కబోతోందని క్లారిటీ ఇచ్చేశాడు. పిల్ల జమీందార్ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్న అశోక్, రెండో సినిమా చేయడం కోసం చాలా కష్టపడ్డాడు. ఎట్టకేలకు ప్రభాస్ కూడా సినిమా కోసం ఒక చేయి వేయడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలకెక్కింది. చారిత్రక భాగమతి కథ సినిమా తీయడానికి బాగానే ఉంటుంది కానీ, ప్రస్తుతం అంత బడ్జెట్ కు వెళ్లకపోవడమే మేలని సినిమాను నిర్మిస్తున్న యువీ క్రియేషన్స్ భావిస్తోందట. మొత్తమ్మీద మరో హీరోయిన్ ఓరియెంటెడ్ కథ అనుష్క ఖాతాలో చేరిందన్నమాట..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



