అచ్చొచ్చిన భామతోనే ప్లాన్ చేశాడు..!
on May 19, 2016

ఎనర్జిటిక్ హీరో అని పేరు తెచ్చుకున్నా హీరో రామ్ కు లక్ మాత్రం కలిసిరాలేదు. గత కొన్నేళ్లుగా అతనితో దోబూచులాడిన విక్టరీ, ఎట్టకేలకు నేను శైలజ సినిమాతో దక్కింది. ఆ తర్వాతి నుంచి, చాలా సెలక్టివ్ గా సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడట రామ్. అందుకే ఇప్పటి వరకూ సరైన స్క్రిప్ట్ దొరక్క వెయిట్ చేశాడు. అయితే తాజాగా కందిరీగ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ చెప్పిన కథ నచ్చడంతో ఎట్టకేలకు దానికి ఊకొట్టాడు. ఈ మూవీకి రామ్ కు సరైన జోడీని వెతికే పనిలో పడ్డారు మూవీ టీం. ఇప్పటి వరకూ తమన్నా, రాశీఖన్నాల పేర్లను హీరోయిన్స్ గా తీసుకుందామని ట్రై చేశారు. కానీ ఆ ఇద్దరితో రామ్ తీసిన సినిమాలు మంచి ఫలితాలు దక్కకపోవడంతో సెంటిమెంట్ తో వద్దన్నాడట. ఎట్టకేలకు పండగచేస్కో సినిమాలో తనతో జతకట్టిన రకుల్ ప్రీత్ ను హీరోయిన్ గా ఓకే చెప్పాడు. త్వరలోనే మూవీ పట్టాలెక్కబోతోందని, సినిమా స్టోరీలైన్ చాలా వైవిధ్యంగా ఉంటుందని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



