శాతకర్ణిలో భల్లాలదేవుడు ఏం చేస్తున్నట్టో...!
on May 19, 2016

గౌతమీ పుత్ర శాతకర్ణి తో తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ల్యాండ్ మార్క్ ఫిలింగా తెరకెక్కిస్తున్నారు నందమూరి బాలయ్య. సినిమా క్రేజ్ కోసం ఎన్ని మసాలు ఉండాలో అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికే క్యాస్టింగ్ బాలీవుడ్ తారలతో కాక పుట్టించిన బాలయ్య అండ్ కో, తాజాగా మూవీలోకి మరో కీలక పాత్రధారిని తీసుకునే ఆలోచన చేస్తున్నారట. బాహుబలిలో భల్లాలదేవుడిగా తన పెర్ఫామెన్స్ తో మెప్పించిన రానా ను ఈ సినిమాలో కీలకమైన పాత్రకు తీసుకోవాలని దర్శకుడు క్రిష్ భావిస్తున్నాడట. బాహుబలి, రుద్రమదేవి సినిమాలతో చారిత్రక, జానపద చిత్రాలకు తానెంత సెట్టవుతాడో ప్రూవ్ చేసుకున్నాడు రానా. అందుకే మరోసారి అదే తరహా పాత్రలో రానాను నటింపచేయడానికి చూస్తున్నారు శాతకర్ణి టీం. సినిమాలో బాలయ్య తో సమానంగా ఉండే రోల్ అని దీనికి భల్లాలదేవుడు కూడా సుముఖంగానే ఉన్నాడని అంటున్నారు. ఇప్పటికే క్రిష్ డైరెక్షన్లో కృష్ణం వందే జగద్గురుం సినిమాలో రానా నటించాడు. ఆ సినిమాలతో నటుడిగా కూడా రానాకు మంచి గుర్తింపే లభించింది. మరి ఈ సారి ఎలాంటి పాత్రతో రానా కనబడబోతున్నాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



