ప్రణీత కనిపించడం లేదు..!
on May 18, 2016

బ్రహ్మోత్సవం ప్రమోషన్లు ఓ రేంజులో సాగుతున్నాయి. ఎప్పుడూ లేనిది.. మహేష్ బాబు పోటీపడి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఏ పేపర్ చూసినా, టీవీ ఛానల్ మార్చినా.. అన్నిచోట్లా బ్రహ్మోత్సవం గురించే. మహేష్, కాజల్, సమంత.. అంతా సందడి చేస్తున్నారు. దర్శక నిర్మాతలు కూడా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ టీమ్ లో కనిపించనిదల్లా ప్రణీతనే. బ్రహ్మోత్సవం ప్రమోషన్లలో ఎక్కడా ప్రణీత కనిపించలేదు. అసలు ఆమె బ్రహ్మోత్సవం సినిమాకి సంబంధించి మీడియా ముందుకు వచ్చిందే లేదు. చిత్రబృందమే ప్రణీతను వాడుకోవడం లేదా? లేదంటే ప్రణీతే ఈ సినిమాని పక్కన పెట్టిందా అన్నది తెలియడం లేదు.
బ్రహ్మోత్సవం ఆడియో ఫంక్షన్లో తనకు అవమానం జరిగిందని ప్రణీత భావిస్తోందని, అందుకే ప్రమోషన్లకు రావడం లేదని టాక్. ఈ సినిమాలో ప్రణీత పాత్రకు అంత స్కోప్ లేదట. ఉన్న ఆ కాసిన్ని సీన్లూ.. ఎడిటింగ్ లో కొట్టుకెళ్లిపోయాయట. దాంతో చిత్రబృందంపై ప్రణీత అలిగిందని తెలుస్తోంది. అందుకే కావాలని ప్రమోషన్లకు డుమ్మా కొట్టిందని సమాచారం. ప్రణీత మాట్లాడడం వల్ల.. తమ సినిమాకి ఒరిగిందేమీ లేదని చిత్రబృందం కూడా భావించడం వల్ల ప్రణీత వచ్చినా, రాకపోయినా బ్రహ్మోత్సవం టీమ్ కూడా పట్టించుకోవడం లేదట. పాపం.. మహేష్ సినిమా కదా, ఈ సినిమాతో తన కెరీర్ కి టర్నింగ్ పాయింట్ దొరికేస్తుంది అని గంపెడాశలు పెట్టుకొంది ప్రణీత. ఆ ఆశలన్నీ ఆడియాశలు అయిపోయాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



