అందాల నటుడు హరనాథ్ కూతురు కన్నుమూత!
on Dec 20, 2022

ప్రముఖ నిర్మాత జి.వి.జి.రాజు భార్య పద్మజా రాజు ఈరోజు మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆమె వయసు 54 సంవత్సరాలు. ఇద్దరు కుమారులు ఉన్నారు. నాటి తరం అందాల హీరో హరనాథ్ కు పద్మజ కూతురు. ఆమె అన్న శ్రీనివాసరాజు కూడా నిర్మాతనే.
పద్మజారాజు భర్త జి.వి.జి.రాజు.. పవన్ కళ్యాణ్ హీరోగా 'గోకులంలో సీత', 'తొలిప్రేమ' వంటి చిత్రాలు నిర్మించారు. ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'గోదావరి' చిత్రం కూడా తెరకెక్కించారు. ఇటీవల పద్మజారాజు తన తండ్రి హరనాథ్ గురించి 'అందాలనటుడు' పేరుతో ఓ పుస్తకం వెలుగులోకి తెచ్చారు. ఆ పుస్తకాన్ని నటశేఖర కృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా త్వరలోనే తన కుమారుల్లో ఒకరు నిర్మాతగా పరిచయం కానున్నారనీ ఆమె తెలిపారు. వచ్చే యేడాది తన తనయుణ్ణి నిర్మాతగా పరిచయం చేసే ప్రయత్నాల్లోనే పద్మజ, ఆమె భర్త జి.వి.జి.రాజు ఉండగానే ఆమె హఠాన్మరణం చెందడం విచారకరం. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



