'మా బావ మనోభావాలు' అంటున్న బాలయ్య!
on Dec 21, 2022

నటసింహం నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం 'వీరసింహా రెడ్డి'. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే 'జై బాలయ్య', 'సుగుణ సుందరి' సాంగ్స్ విడుదలై ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు మూడో సాంగ్ కి కూడా ముహూర్తం ఖరారైంది.
'వీరసింహా రెడ్డి'లోని మూడో సాంగ్ ఐటెం సాంగ్ అని, ఇది అదిరిపోతుందని ఇటీవల సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. దీంతో ఈ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మూవీ టీమ్ మూడో సాంగ్ అప్డేట్ ఇచ్చింది. 'మా బావ మనోభావాలు' అంటూ సాగే ఈ పాటని డిసెంబర్ 24న మధ్యాహ్నం 3:19 కి విడుదల చేయనున్నట్లు తెలుపుతూ పోస్టర్ ని వదిలారు. అందులో బాలయ్య లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



