రూట్ మార్చిన హెబ్బా పటేల్.. సునీల్ తో 'గీత'!
on Oct 14, 2021

హెబ్బా పటేల్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'గీత'. 'మ్యూట్ విట్నెస్' అన్నది ఉప శీర్షిక. వీవీ వినాయక్ ప్రియశిష్యుడు 'విశ్వా.ఆర్.రావు'ను దర్శకుడిగా పరిచయం చేస్తూ 'గ్రాండ్ మూవీస్' బ్యానర్ పై ఆర్.రాచయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'నువ్వే కావాలి', 'ప్రేమించు' చిత్రాల ఫేమ్ సాయి కిరణ్ ఈ సినిమాతో ప్రతి నాయకుడిగా పరిచయమవుతున్నారు.
గ్లామరస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హెబ్బా పటేల్ కాస్త రూట్ మార్చి 'గీత' సినిమాలో అనాథల కోసం పోరాడే మూగ యువతిగా ఓ చాలెంజింగ్ రోల్ చేస్తుండడం విశేషం. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను డైరెక్టర్ వి.వి.వినాయక్ త్వరలో రిలీజ్ చేయనున్నారు.
రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, 30 ఇయర్స్ పృథ్వి , తనికెళ్ళ భరణి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



