మాస్ మహారాజా 'ధమాకా'!
on Oct 14, 2021
`నేను లోకల్` ఫేమ్ త్రినాథరావ్ నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్.. ఈ నెల 4 నుంచి శరవేగంగా జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. `#RT 69` అనే వర్కింగ్ టైటిల్ తో తయారవుతున్న ఈ సినిమాకి తాజాగా `ధమాకా` అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు టాక్. కథానుసారం ఈ టైటిల్ అయితేనే యాప్ట్ గా ఉంటుందని టీమ్ భావిస్తోందట. త్వరలోనే రవితేజ - త్రినాథరావ్ నక్కిన కాంబినేషన్ మూవీకి సంబంధించిన టైటిల్ పై క్లారిటీ రానున్నది. `పెళ్ళి సందడి` ఫేమ్ శ్రీ లీల నాయికగా నటించనున్న `#RT 69`కి భీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నాడు. 2022 ద్వితీయార్ధంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరపైకి రానుంది.
కాగా, మరోవైపు రవితేజ తాజా చిత్రాలు `ఖిలాడి`, `రామారావు ఆన్ డ్యూటీ` చిత్రీకరణ తుది దశలో ఉన్నాయి. రమేశ్ వర్మ దర్శకత్వంలో `ఖిలాడి` తెరకెక్కుతుండగా.. శరత్ మండవ నిర్దేశకత్వంలో `రామారావు ఆన్ డ్యూటీ` రూపొందుతోంది. తక్కువ గ్యాప్ లోనే ఈ రెండు సినిమాలు కూడా ఎంటర్టైన్ చేయనున్నాయి.
Also Read