బన్నీ కూతురుకి ఇంగ్లీష్ మాట్లాడటం రాదా?
on Mar 26, 2023
అల్లు అర్జున్ తనయ అల్లు అర్హ గురించి ఇంట్రస్టింగ్ విషయం వైరల్ అవుతోంది. అల్లు అర్హకు ఇంగ్లిష్ మాట్లాడటం రాదట. హాయ్ అని కూడా ఇంగ్లిష్ లో చెప్పదట అర్హ. ఈ విషయాన్ని సమంత ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అల్లు అర్హ బోర్న్ సూపర్‌స్టార్ అని అన్నారు. సమంత మాట్లాడుతూ "అల్లు అర్హకు ఎక్కడా భయం ఉండదు. తను చాలా యాక్టివ్ గర్ల్. తనకు ఇంగ్లిష్ మాట్లాడటం రాదు. హాయ్ అని చెప్పినా తెలుగులోనే చెబుతుంది. చాలా క్యూట్‌గా తెలుగు మాట్లాడుతుంది. అది కూడా రూటెడ్ తెలుగు తను మాట్లాడుతుంటే చాలా ముద్దుముద్దుగా ఉంటుంది. ఇవాళ్రేపు స్కూల్లోనూ, కాలేజ్‌ల్లోనూ ఇంగ్లిష్ ఎలాగూ వస్తుంది. కానీ మాతృభాషను చిన్నతనంలో అంత అందంగా నేర్చుకునే పిల్లలు అరుదై పోతున్నారు. అల్లు అర్హ వండర్‌కిడ్" అని అన్నారు.
అర్హ యాక్టింగ్ గురించి చెబుతూ "అర్హ కనిపించే ప్రతి ఫ్రేమ్‌నీ జనాలు మైమరిచి చూస్తుండిపోతారు. అంత అద్భుతంగా ఉంటాయి. తన ఫస్ట్ డే షూట్ పెద్ద ప్యాలస్ సెట్లో జరిగింది. చుట్టూ చాలా మంది జనాలున్నారు. అయినా ఎక్కడా అదురూ బెదురూ లేకుండా నటించింది అర్హ. తనకు చాలా పెద్ద పెద్ద డైలాగులున్నాయి. వాటిని చాలా ఈజ్‌తో చెప్పింది. తెలుగులో అంత పెద్ద డైలాగులు చెప్పడం మామూలు విషయం కాదు. పాపను చూసిన వారందరూ వాళ్ల నాన్నను గుర్తు చేసుకుంటున్నారు. బోర్న్ ఆర్టిస్ట్ అంటూ పొగుడుతున్నారు. నా దృష్టిలో అర్హ ప్యాన్ ఇండియన్ ఆర్టిస్ట్. ఎక్కడా తగ్గేదేలే అన్నట్టు నటించింది. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ అర్హ యాక్టింగ్‌కి ఫిదా అయిపోతారు. తనని అడ్మయర్ చేస్తారు" అని అన్నారు.
సమంత నటించిన శాకుంతలంలో కీలక పాత్రలో కనిపిస్తుంది అల్లు అర్హ. ఈ సినిమా షూటింగ్‌కి వెళ్లి తన కుమార్తె కొన్ని ఇంగ్లిష్ పదాలు నేర్చుకుంటుందని, గుణశేఖర్‌తో కంప్లయింట్ కూడా చేశారట బన్నీ. గుణశేఖర్ దర్శకత్వం వహించిన సినిమా శాకుంతలం. ఈ సినిమాలో అల్లు అర్హకి కూడా నిజమైన బంగారు నగలే వాడినట్టు సమాచారం. దాదాపు 14 కోట్ల రూపాయలు విలువ చేసే నగలను ఈ సినిమా కోసం వాడారు. మేనక కేరక్టర్ కోసం వాడినవన్నీ డైమండ్ నగలే కావడం విశేషం.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
