రానా హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'హిరణ్యకశిప'!
on Dec 11, 2022

రానా దగ్గుబాటి, దర్శకుడు గుణశేఖర్ కాంబినేషన్ లో 'హిరణ్యకశిప'ను రూపొందించాలని నిర్మాత సురేష్ బాబు భావించారు. ఈ చిత్రం స్క్రిప్ట్ దశలో ఉందని పలు సందర్భాల్లో రానా, గుణశేఖర్ చెప్పుకొచ్చారు. ఈమధ్య ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి చప్పుడు లేకపోవడంతో ఆగిపోయిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేదని, దర్శకుడు మారిపోయాడని చెప్పి షాకిచ్చారు సురేష్ బాబు.
పాన్ ఇండియా రేంజ్ లో మరో పెద్ద దర్శకుడితో 'హిరణ్యకశిప'ను రూపొందించబోతున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో సురేష్ బాబు తెలిపారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పనులు జరుగుతున్నాయని, త్వరలో మిగతా విషయాలు తెలుస్తాయని అన్నారు.
అయితే సురేష్ బాబు చెప్పిన ఆ పెద్ద దర్శకుడు త్రివిక్రమ్ అని ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ కి పురాణాలపై మంచి పట్టుంది. 'భీమ్లా నాయక్' సమయంలో రానా-త్రివిక్రమ్ మధ్య 'హిరణ్యకశిప' గురించి చర్చలు జరిగాయని, అలా ఈ ప్రాజెక్ట్ లోకి త్రివిక్రమ్ వచ్చాడని అంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్.. మహేష్ బాబుతో ఓ చిత్రం చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత 'హిరణ్యకశ్యప' చేస్తాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



