మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాత్రమే నా హీరో!
on Dec 11, 2022

బుల్లితెర ఆడియన్స్ కి చమ్మక్ చంద్ర గురించి పెద్దగా పరిచయం చేయక్కర్లేదు. ఫ్యామిలీ స్కిట్స్ వేస్తూ నవ్విస్తూ అలరిస్తుంటాడు. సినిమాలలోనూ నటిస్తూ రాణిస్తున్నాడు. జబర్దస్త్ లో నాగబాబు ప్రియమైన శిష్యుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లైఫ్ లో తనకు అవకాశాలు ఇప్పించే ఏ హీరో లేడు అని సంచలన వ్యాఖ్యలు చేసాడు.
"నా లైఫ్ లో ప్రత్యేకంగా ఏ హీరో లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మాత్రమే నా హీరో.. ఎందుకంటే ఆయన అన్ని సినిమాల్లో నేను చేస్తూ వచ్చాను, చేస్తున్నాను. జబర్దస్త్ లో నా స్కిట్స్ చూసి 'అఆ' సినిమాలో నాకో మంచి రోల్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేశారు. ఒక్క సీన్ ఐనా సరే థియేటర్ లో ఆడియన్స్ నవ్వుకునేలా డిజైన్ చేశారు. ఇక అప్పటినుంచి నా జర్నీ ఆయనతో కంటిన్యూ అవుతోంది. ఇప్పటికి నా గురువు ఆయనే.. నేను ఏ హీరో దగ్గరకు వెళ్లి వేషాలు అడిగి ఇబ్బంది పెట్టలేదు.. ఎవరికైనా ఆ క్యారెక్టర్ నేను చేయగలను అని అనిపిస్తే వాళ్ళే పిలుస్తారు. మూవీస్ లో చిన్న రోల్ కావొచ్చు, పెద్ద రోల్ కావొచ్చు ఏది ఇచ్చినా వాళ్లకు ముందు థ్యాంక్స్ చెప్తాను. కానీ జబర్దస్త్ లో లాంటి లేడీ గెటప్స్ వస్తుంటే మాత్రం చేయడం లేదు ఎందుకంటే అక్కడ , ఇక్కడ సేమ్ ఐపోతే ఆడియన్స్ కి బోర్ ఫీలింగ్ వస్తుందని ఆ రోల్స్ ని అవాయిడ్ చేస్తున్నాను" అని చెప్పాడు చమ్మక్ చంద్ర.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



