ప్రతాపరుద్రుడికి దిల్ రాజు హ్యాండ్ ఇచ్చాడా..?
on Jun 6, 2016
రుద్రమదేవి తర్వాత కొనసాగింపుగా ప్రతాపరుద్రుడు సినిమా వస్తుందని కార్డ్ వేసేశాడు గుణశేఖర్. అయితే రుద్రమదేవికి గుణ లాభాల్లోకి వెళ్లిపోయి ఉంటే ఈపాటికి తీసి ఉండేవాడే. కానీ ఆ సినిమా అతనికి మిగిల్చిందేమీ లేదు. అయితే అతని పరిస్థితి చూసిన దిల్ రాజు సీక్వెల్ నేను చేస్తానని ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించేశాడు. కానీ ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలేమీ బయటకు రాలేదు. దిల్ రాజు తీస్తానన్నాడు కదా అని తన టీమ్ తో ప్రతాపరుద్రుడి గురించి పూర్తి రిసెర్చ్ చేసి మొత్తం సిద్ధం చేసి పెట్టుకున్నాడు గుణశేఖర్. అయితే లేటెస్ట్ గుణ కు దిల్ రాజు ఝలక్ ఇచ్చాడనే ప్రచారం సాగుతోంది.
సినిమా బాగా భారీ బడ్జెట్ సినిమాగా, కాస్త గ్యాప్ తీసుకుని చేద్దామని, ఈ లోపు వేరే చిన్న ప్రాజెక్ట్స్ చేస్తుండమని చెప్పాడట. వచ్చే ఏడాది రెండు భారీ హిస్టారికల్, మైథలాజికల్ మూవీస్ శాతకర్ణి, బాహుబలి వస్తున్నాయి కాబట్టి ప్రేక్షకులు మనల్ని రిజెక్ట్ చేసే అవకాశాలుంటాయి. పైపెచ్చు ఇప్పుడే మూవీ స్టార్ట్ చేసేస్తే, హీరోగా ఎవర్ని పెట్టాలన్నది కూడా సమస్యగానే మారుతుంది కాబట్టి ఓ రెండేళ్ల తర్వాత సినిమా చేద్దామంటూ రాజు పోస్ట్ పోన్ చేశాడట. దీంతో షాక్ అవడం గుణశేఖర్ వంతయ్యింది. అయితే, దిల్ రాజుకు పరిశ్రమలో మాట తప్పడని మంచి పేరు ఉంది. సో, ఈలోపు మీడియం బడ్జెట్ లో కొన్ని సినిమాలు తీస్తే రికవర్ అవ్వచ్చు కాబట్టి వాటివైపు గుణశేఖర్ మొగ్గు చూపే అవకాశం ఉంది. అదృష్టం బాగుండి ఈలోపే ఎవరైనా పెద్ద నిర్మాత దొరికితే డైరెక్ట్ ప్రతాపరుద్రుణ్ని తెరకెక్కించినా ఆశ్చర్యం లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



