త్రివిక్రమ్ పవన్ తో ' కోబలి ' మొదలెడతాడా..?
on Jun 6, 2016

అ ఆ రిలీజైంది. సూపర్ హిట్టైంది. దర్శక రచయిత త్రివిక్రమ్ ఫుల్ జోష్ గా ఉన్నాడు. మరో వైపు సర్దార్ ఇచ్చిన భారీ షాక్ నుంచిఇప్పుడిప్పుడే తేరుకుని కొత్త సినిమా గురించి ఆలోచిస్తున్నాడు పవన్. ఒకళ్లు సూపర్ హిట్, మరొకరు అట్టర్ ఫ్లాప్. అయితే ఇలాంటి సమీకరణాలతో వీళ్లిద్దరు కలిసి చేసే సినిమాకు సంబంధం ఉండదు. ఆటోమేటిగ్గా సినిమాకు హైప్ వచ్చేస్తుంది. వీళ్లిద్దరి కాంబోకు ఉన్న క్రేజ్అలాంటిది. ఇద్దరూ కలిసి చేసిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు ఎంత సంచలనం సృష్టించాయో తెలిసిందే.
గతంలో కోబలి అనే సంచలన స్క్రిప్ట్ ను త్రివిక్రమ పవన్ కు వినిపించాడు. దాన్ని పవన్ కళ్యాణ్ సొంత బ్యానర్లోనే తెరకెక్కించాలని ఇద్దరూ అనుకున్నారు కూడా. అయితే ఏవో కారణాల వలన ఆ స్క్రిప్ట్ పక్కకు వెళ్లిపోయింది. ప్రస్తుతం అదే స్క్రిప్ట్ ను బయటికి తీసి వర్క్ చేస్తున్నాడట త్రివిక్రమ్. అ ఆ తీసిన రాథాకృష్ణ నిర్మాణంలోనే ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. పవన్ ఎస్ జె సూర్యతో సినిమా కంప్లీట్ చేసేసరికి కోబలి స్క్రిప్ట్ అండ్ ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి చేసేయాలని చూస్తున్నాడు త్రివిక్రమ్. ఇప్పటి వరకూ పవన్ చేయని డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



