సెన్సార్ బోర్డ్ ఆ సినిమాను ఎడాపెడా కోసేసింది...!
on Jun 6, 2016
.jpg)
షాహిద్ కపూర్, కరీనా కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ' ఉడ్తా పంజాబ్ '. పంజాబ్ లో తీవ్రంగా ఉన్న డ్రగ్స్ సమస్యను ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించిన సినిమా ఇది. డ్రగ్ప్ వాడకం ఇలాగే కొనసాగితే, పంజాబ్ నేరాలకు, ఘోరాలకు అడ్డాగా మారిపోతుంది అని చెప్పే విధంగా కథను రాసుకుని తెరకెక్కించాడు దర్శకుడు అభిషేక్ చౌబే. అయితే సెన్సార్ లో మాత్రం ఈ సినిమాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచే మూవీలో అభ్యంతరకర సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం సాగింది. ఆ ఎఫెక్టే సెన్సార్ సర్టిఫికెట్ కు తగిలింది. ఒకటీ రెండూ కాదు, సెన్సార్ బోర్డ్ ఏకంగా 40 సీన్లను కట్ చేసేసింది. డ్రగ్స్ వాడకూడదు అని చెప్పడానికి తీసిన సినిమాలో, డ్రగ్స్ వాడకం చూపించకుండా ఎలా తీస్తాం. ఏమాత్రం ఆలోచన లేకుండా ఇన్ని సీన్లు కట్ చేయడమేంటి, అవసరమైతే సర్టిఫికెట్ ఇవ్వాలి గానీ, అంటూ మండి పడుతున్నారు మూవీ టీం. సెన్సార్ తీరుపై దర్శకనిర్మాతలు సమాచార శాఖ అధికారుల్ని కలిసేందుకు డిసైడ్ అయ్యారు. అయితే సినిమా రిలీజ్ డేట్ ను జూన్ 17 అని ఇవ్వడంతో, ఈ లోపుగా వివాదం క్లియర్ అవుతుందా, లేక విడుదలను వాయిదా వేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



