గోపీచంద్ ఫస్ట్ టైం పంచె కట్టాడు..!
on Jun 11, 2016

ఆక్సిజన్. ఈ సినిమా ఎలా ఉంటుందో తెలీదు కానీ, పోస్టర్లు మాత్రం యావరేజ్ గానే కనిపిస్తున్నాయి. సినిమా టైటిల్ ను విభిన్నంగా పెట్టి అందరి దృష్టి ఆకర్షించిన మూవీ టీం, పోస్టర్లలో మాత్రవ వైవిధ్యం చూపించలేకపోతోంది. ఎర్ర చొక్కాలో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు, ఇంతేగా అన్నారు జనాలు. రీసెంట్ గా ఒక సాంగ్ లోని పంచెకట్టు స్టిల్ ను విడుదల చేశారు. గోపీ బాగానే కనిపిస్తున్నా, సినిమా రొటీన్ మాస్ ఎంటర్ టైనర్ అనే ఫీలింగ్ ను తీసుకొస్తున్నాయి ఈ పోస్టర్స్. ఆదివారం గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ముందు రోజే ఈ లుక్ ను రిలీజ్ చేశారు.
చాలా కాలం తర్వాత ఎ.ఎం.రత్నం తెలుగులో చేస్తున్న సినిమా ఇదే. ఆయన కొడుకు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తుండగా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. పుట్టినరోజు సందర్భంగా గోపీచంద్ కు శుభాకాంక్షలు తెలిపాడు దర్శకుడు జ్యోతి కృష్ణ. సినిమాలో జగపతిబాబు కీలక పాత్ర చేస్తున్నారని, ఆయన పాత్ర మూవీకి హైలెట్ గా నిలుస్తుందని, వీలైనంత త్వరలో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అంటున్నాడు జ్యోతి కృష్ణ. జిల్, సౌఖ్యం సినిమాల ఫలితాలతో డౌన్ అయిన గోపి కెరీర్ కు ఈ సినిమా అయినా ఆక్సిజన్ ఇస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



