ఇద్దరూ మళ్లీ ప్యాచప్ అయిపోయారట..!
on Jun 11, 2016
.jpg)
వాళ్లిద్దరూ విడిపోవడమూ అయింది. మళ్లీ కలిసిపోవడమూ అయింది. పెళ్లి కూడా చేసుకుందామనున్న వాళ్లు కాస్తా, ఏమయిందో ఏమో ఒక్కసారిగా దూరమైపోయారు. విడి విడిగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారు. ఇదంతా ఉపోద్ఘాతమంతా టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ల గురించే. మొన్నీ మధ్యే షూటింగ్ కోసం విదేశాలకు స్టార్ట్ అయిన అనుష్కను విరాట్ స్వయంగా ఎయిర్ పోర్టుకు తీసుకెళ్లాడు. కారులో లిప్ కిస్ కూడా ఇచ్చాడు లెండి. ఇదంతా మీడియా బాగానే క్యాప్చర్ చేసింది.
షూటింగ్ అయిపోయిన తర్వాత ఇండియాకు వచ్చేసిన అనుష్క, వెంటనే ఢిల్లీలోని ప్రియుడి ఇంటికి చేరుకుంది. రోజంతా అతని కుటుంబసభ్యులతో గడిపింది. ఆ తర్వాత లవర్స్ ఇద్దరూ బయటికి షార్ట్ ట్రిప్ కూడా వేశారట. ప్రస్తుతం టీం ఇండియా జింబాబ్వే టూర్ లో బిజీగా ఉన్నా, కోహ్లీకి మాత్రం రెస్ట్ ఇవ్వడంతో హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు. ఈ గ్యాప్ లోనే లవర్ తో కలిసి ఫుల్లుగా టూర్స్ వేస్తున్నాడు. అనుష్క కూడా షూటింగ్స్ లో ఏమాత్రం గ్యాప్ వచ్చినా, వెంటనే కోహ్లీ దగ్గర వాలిపోతోందట. అంతా బాగానే ఉంది కానీ, వీళ్లిద్దరు అసలు నిజంగానే విడిపోయారా..లేక విడిపోయినట్టు యాక్ట్ చేశారా అంటూ గుసగుసలాడుతున్నారు బాలీవుడ్ జనాలు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



