'గూఢచారి-2' అప్డేట్ వచ్చేసింది.. అంతకుమించి!
on Dec 29, 2022

అడివి శేష్ హీరోగా నటించిన సూపర్ హిట్ స్పై థ్రిల్లర్ ఫిల్మ్ 'గూఢచారి'(2018)కి సీక్వెల్ రాబోతుంది. 'మేజర్' మూవీ ఎడిటర్ వినయ్ సిరిగినీది ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 'గూఢచారి' చిత్రానికి ఆయన డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పని చేయడం విశేషం.
'గూఢచారి-2'ని పాన్ ఇండియా మూవీగా భారీస్థాయిలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. జనవరి 9న ఢిల్లీ, ముంబై నగరాల్లో మూవీ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించనున్నారు. అదే రోజున 'ప్రీ విజన్ వీడియో'ని కూడా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన 'కార్తికేయ-2' పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే అడివి శేష్ నటించిన 'మేజర్' సైతం పాన్ ఇండియా రేంజ్ లో ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వీరి కలయికలో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'గూఢచారి-2' కూడా అదే రిజల్ట్ రిపీట్ చేస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



