'ధమాకా' రైటర్ తో నాగార్జున సినిమా.. ఇన్ని సర్ ప్రైజ్ లా!
on Dec 29, 2022

'సినిమా చూపిస్త మావ', 'నేను లోకల్', 'ధమకా' వంటి కమర్షియల్ సినిమాలతో సక్సెస్ ఫుల్ రైటర్ గా పేరు తెచ్చుకున్న ప్రసన్న కుమార్ బెజవాడ త్వరలో మెగాఫోన్ పట్టుకోబోతున్నాడు. తన కెరీర్ లో ఎందరో కొత్త దర్శకులకు అవకాశమిచ్చిన అక్కినేని నాగార్జున.. ప్రసన్న కుమార్ ను దర్శకుడిగా పరిచయం చేయబోతున్నాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి పలు క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి.
ఇప్పటిదాకా ప్రసన్న కుమార్ రచయితగా పని చేసిన సినిమాలను పరిశీలిస్తే.. కథలో కొత్తదనం లేకపోయినా వినోదంతో బోర్ కొట్టకుండా సినిమాని నడిపించడం ఆయన శైలి. ఇప్పుడదే శైలిలో నాగార్జున కోసం ఓ యాక్షన్ ఎంటర్టైనర్ కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ కథ రెండు దశల్లో జరుగుతుందట. ద్విపాత్రాభినయం కానప్పటికీ.. యంగ్, ఓల్డ్ పాత్రల్లో నాగార్జున రెండు గెటప్స్ లో కనిపించనున్నాడని సమాచారం.
అలాగే ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడని వినికిడి. అంతేకాదు ఒక యంగ్ హీరో, హీరోయిన్ జోడీ కూడా ఈ సినిమాలో సందడి చేయనుందని ప్రచారం జరుగుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



