టాలీవుడ్ లో మరో విషాదం.. వల్లభనేని జనార్ధన్ కన్నుమూత!
on Dec 29, 2022

టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ, చలపతిరావు మరణ వార్తలు మరువకముందే.. మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత వల్లభనేని జనార్ధన్ కన్నుమూశారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
నాటక రంగం నుంచి సినీ రంగంలోకి వచ్చిన జనార్ధన్.. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో 'అమాయక చక్రవర్తి', 'తోడు నీడ', 'శ్రీమతి కావాలి', 'పారిపోయిన ఖైదీలు' వంటి సినిమాలు వచ్చాయి. అలాగే 120కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. 'గ్యాంగ్ లీడర్' సినిమాలో పోషించిన పోలీసు పాత్ర ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. అక్కడ నుంచి నటుడిగా కొనసాగారు.
ప్రముఖ దర్శకనిర్మాత విజయ బాపినీడు కుమార్తె లలిని చౌదరిని జనార్ధన్ వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె అభినయ, కుమారుడు అవినాష్ ఉన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



