3 రోజులకు 'గాడ్‌ఫాదర్' రికవర్ చేసింది 37 శాతమే!
on Oct 8, 2022
చిరంజీవి టైటిల్ రోల్ చేసిన 'గాడ్‌ఫాదర్' మూవీ మూడో రోజు ఓ మోస్తరు వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 7 కోట్ల షేర్, తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.41 కోట్ల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో మూడు రోజులకు కలిపి 'గాడ్‌ఫాదర్' వరల్డ్‌వైడ్‌గా రూ. 34.36 కోట్ల షేర్, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల్లో రూ. 26.11 కోట్ల షేర్ సాధించినట్లు అంచనా. శుక్రవారం ఈ మూవీ తెలంగాణలో రూ. 1.68 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.60 కోట్లు, రాయలసీమలో రూ. 1.13 కోట్ల షేర్ రాబట్టింది.
'గాడ్‌ఫాదర్' వరల్డ్‌వైడ్ ప్రి బిజినెస్ వాల్యూ రూ. 91 కోట్లని అంచనా. అంటే ఇప్పటివరకు రికవర్ అయ్యింది 37.75 శాతం మాత్రమే. తెలుగు రాష్ట్రాల ప్రి బిజినెస్ విలువ రూ. 70.5 కోట్లు కాగా, ఇప్పటివరకూ వచ్చింది 37 శాతం. శనివారం, ఆదివారం ఎక్కువ వసూళ్లు రాబడితేనే మూవీ బ్రేకీవెన్‌కు దగ్గరగా వచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 12.97 కోట్లు, రెండో రోజు రూ. 7.73 కోట్లు, మూడో రోజు రూ. 5.41 కోట్ల షేర్ వచ్చింది.
మోహన్‌లాల్ నటించిన మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ 'లూసిఫర్'కు 'గాడ్‌ఫాదర్' రీమేక్. మోహన్ రాజా డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నయనతార, సత్యదేవ్, మురళీశర్మ, తాన్యా రవిచంద్రన్, సముద్రకని, సర్వదమన్ బెనర్జీ, పూరి జగన్నాథ్, సునీల్ తదితరులు నటించారు. సల్మాన్ ఖాన్ ఓ ప్రత్యేక పాత్రలో మెరిశాడు. తమన్ సంగీతం సమకూర్చగా, నీరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశాడు.
Also Read