అరే పిచ్చి క్యూటీస్.. నేనంటే ఎందుకురా మీకు అంత ప్రేమ?
on Oct 8, 2022

అనసూయ గ్లామరస్ యాంకర్ గా బుల్లితెర మీద ఫుల్ బిజీగా ఉండే ఆర్టిస్ట్. ఐతే బుల్లితెర మీద ఈమెకు షోస్ తగ్గాయనే చెప్పొచ్చు. బిగ్ స్క్రీన్ మీద ఆఫర్స్ తో బిజీ ఐపోయింది. ఇటీవల చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీలో అనసూయ నటించింది. చిరంజీవి సినిమాలో నటించి ప్రమోషన్స్‌లో కనిపించకపోయేసరికి నెటిజన్స్ ఆమెను బాగా ట్రోల్ చేశారు. అలాగే ప్రెస్ మీట్ లో చిరు తన పేరు చెప్పనందుకు అలిగి మరీ సారీ చెప్పించుకుంది. వరుస షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్లే 'గాడ్ ఫాదర్' ప్రమోషన్‌లో పార్టిసిపేట్ చేయలేకపోయానని అనసూయ చెప్పినా ట్విట్టర్ లో ట్రోల్స్ ఆగలేదు. అప్పుడు అనసూయ తనదైన స్టయిల్లో స్పందించింది.
‘‘ఎందుకురా నేనంటే మీకు అంత పిచ్చి ప్రేమ.. నేను మీకు చాలా ఇంపార్టెంట్ అంటారు. మళ్ళీ నేను ఏదన్నా అంటే మీరు ఫీల్ అవుతారు.. అయ్యో పిచ్చి క్యూటీస్.. ఇప్పుడు 'ఆ పిచ్చి క్యూటీస్' ఫీల్ అయ్యి మళ్లీ రియాక్ట్ అవుతారా? సరే మీ దగ్గర నా కోసం అంత టైం ఉందంటే మీ ఇష్టం" అంటూ సెటైర్లు వేసింది అనసూయ.
మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన 'లూసిఫర్'కు రీమేక్‌గా తెరకెక్కిన చిత్రం 'గాడ్‌ఫాదర్'. మోహన్‌రాజా డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీలో సత్యదేవ్, నయనతార కీలకపాత్రల్లో నటించారు. ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ లో ఎంటర్టైన్ చేయగా, ఫేమస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, సునీల్, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో కనిపించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



