'గాడ్ ఫాదర్' కలెక్షన్స్ డ్రాప్.. 25 కోట్ల నష్టం తప్పదా?
on Oct 12, 2022
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాదర్' సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో 'ఆచార్య' పరాజయం చేసిన గాయం నుంచి బయటపడొచ్చు అనుకుంటున్న మెగా అభిమానులకు మరోసారి నిరాశ తప్పేలా లేదు. 'గాడ్ ఫాదర్' హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ భారీస్థాయిలో థియేట్రికల్ బిజినెస్ చేసిన కారణంగా.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం కనిపించడంలేదు.
ఆరో రోజైన సోమవారం నుంచి 'గాడ్ ఫాదర్' కలెక్షన్లలో డ్రాప్ కనిపిస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రూ.70.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన 'గాడ్ ఫాదర్' మొదటి రోజు రూ.12.97 కోట్ల షేర్, రెండో రోజు రూ.7.73 కోట్ల షేర్, మూడో రోజు రూ.5.41 కోట్ల షేర్, నాలుగో రోజు రూ.5.62 కోట్ల షేర్, ఐదో రోజు రూ.5.23 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా.. ఆరో రోజు రూ.1.51 కోట్ల షేర్, ఏడో రోజు రూ.83 లక్షల షేర్ రాబట్టిందని అంచనా.
ఏరియాల వారీగా చూస్తే నైజాంలో రూ.11.63 కోట్ల షేర్(బిజినెస్ రూ.22 కోట్లు), సీడెడ్ లో రూ.8.91 కోట్ల షేర్(బిజినెస్ రూ.13.50 కోట్లు), ఆంధ్రాలో రూ.18.76 కోట్ల షేర్(బిజినెస్ రూ.35 కోట్లు)తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఏడు రోజుల్లో రూ.39.30 కోట్ల షేర్ సాధించినట్లు తెలుస్తోంది. అలాగే కర్ణాటకలో 4.50 కోట్ల షేర్, హిందీ+రెస్టాఫ్ ఇండియా 4.55 కోట్ల షేర్, ఓవర్సీస్ లో 4.75 కోట్ల షేర్ కలిపి ఏడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.53.10 కోట్ల షేర్(రూ.96.35 కోట్ల గ్రాస్) రాబట్టినట్టు సమాచారం.
వరల్డ్ వైడ్ గా రూ.91 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ చిత్రం హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే ఇంకా రూ.38 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. కానీ ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆరో రోజు(రూ.2.06 కోట్ల షేర్), ఏడో రోజు(రూ.1.33 కోట్ల షేర్) కలెక్ట్ చేసిన దాన్ని బట్టి చూస్తే.. మరో రూ.8-10 కోట్ల షేర్ కి మించి కలెక్ట్ చేసే అవకాశం లేదంటున్నారు. అదే జరిగితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి రూ.25-30 కోట్ల దూరంలో ఆగిపోతుంది.
Also Read