మూడు వారాల పోరాటంతో కొవిడ్ 19ను జయించిన జెనీలియా!
on Aug 29, 2020

'బొమ్మరిల్లు' హాసిని జెనీలియా మూడు వారాల క్రితం కొవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందట. అయితే ఈ మూడు వారాలుగా ఆమెలో ఎలాంటి కొవిడ్ లక్షణాలు కనిపించలేదంట. ఈ విషయాన్ని ఆమె ఇప్పుడు బహిర్గతం చేసింది. 21 రోజుల పాటు పూర్తి స్థాయిలో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న ఆమె, ఇప్పుడు టెస్ట్‌లో నెగటివ్‌గా తేలింది. ఈ మహమ్మారి వైరస్‌ను జయించినందుకు ఆనందాన్ని వ్యక్తం చేసింది జెనీలియా. ఏదేమైనా, మూడు వారాలు ఐసోలేషన్‌లో ఉండటం బాగా చాలెంజింగ్‌గా అనిపించిందని ఆమె చెప్పింది.
"ఈ వ్యాధితో పోరాడటం నాకు చాలా ఈజీగానే అనిపించింది కానీ, అదే సమయంలో గత 21 రోజులుగా ఐసోలేషన్‌లో గడపడం అనేది నావరకు నాకు మోస్ట్ చాలెంజింగ్‌గా అనిపించింది. ఒంటరితనాన్ని డిజిటల్ ప్రపంచంలో గడపడం ద్వారా అధిగమించగలిగాను. నా కుటుంబాన్నీ, నన్ను ప్రేమించేవాళ్లనీ తిరిగి కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది" అని తన సోషల్ మీడియా అకౌంట్‌లో రాసుకొచ్చింది జెనీలియా.
కొవిడ్ 19 అనేది ఒక మాన్‌స్టర్ అనీ, వెంటనే టెస్ట్ చేయించుకొని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొని, ఫిట్‌గా ఉంటే దానితో పోరాడవచ్చని ఆమె సూచించింది. "ప్రేమతో మీ పరిసరాలను నింపుకోండి. అదే మీకు నిజమైన శక్తినిస్తుంది. ఎవరికైనా కావాల్సింది అదే" అని చెప్పింది జెనీలియా.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



