ఐఎండీబీ రేటింగ్‌లో చెత్త రికార్డ్ సృష్టించిన 'సడక్ 2'!
on Aug 30, 2020

సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మిస్టరీ మృతితో బాలీవుడ్‌లో నెపోటిజంపై తీవ్ర చర్చ జరుగుతూ వస్తోంది. సోషల్ మీడియాలో వారసులపై నెటిజన్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దాని ప్రభావం వారి సినిమాలపై కూడా తీవ్రంగా పడుతోంది. సంజయ్ దత్, అలియా భట్, ఆదిత్యరాయ్ కపూర్, పూజా భట్ కాంబినేషన్‌లో మహేశ్ భట్ రూపొందించిన 'సడక్ 2' సినిమా ఇందుకు ఓ ఉదాహరణ. ఆ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో అత్యధిక డిస్‌లైక్స్ పొందిన ఇండియన్ మూవీగా నెగటివ్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. దాని పాటలను కూడా నెటిజన్లు ద్వేషించారు.
తాజాగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదలైన 'సడక్ 2' మూవీని విమర్శకులు ఏకి పారేయగా, ఐఎండీబీలో పబ్లిక్ సైతం దాన్ని ఎంతగానో ద్వేషిస్తూ ఓటింగ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో దాన్ని ట్రోల్ చేస్తున్నారు. 20 ఏళ్ల తర్వాత దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ఎంతో ప్రెస్టీజియస్‌గా మహేశ్ భట్ తీసిన ఈ సినిమా ఐఎండీబీ చరిత్రలోనే అత్యల్ప రేటింగ్ పొందిన సినిమాగా చెత్త రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ దానికి వచ్చిన రేటింగ్ అక్షరాలా "1.0" మాత్రమే! ఇంత చెత్త రేటింగ్‌ను ఇంతదాకా మరే సినిమా కూడా పొందలేదు.
ఆసక్తికరమైన విషయమేమంటే గతంలో చెత్త సినిమాలుగా ఇటు విమర్శకులు, ప్రేక్షకులు ముక్త కంఠంతో తేల్చి చెప్పిన అజయ్ దేవ్‌గణ్ మూవీ 'హిమ్మత్‌వాలా', అభిషేక్ బచ్చన్ సినిమా 'ద లెజెండ్ ఆఫ్ ద్రోణ', హిమేశ్ రేషమియా ఫిల్మ్ 'కర్జ్' లకు సైతం ఇంతకంటే బెటర్ రేటింగ్ రావడం! 1991 నాటి మహేశ్ భట్ క్లాసిక్ ఫిల్మ్ 'సడక్'కు సీక్వెల్‌గా వచ్చిన 'సడక్ 2'ను ప్రేక్షకులు తిరస్కరించడం ఒక ఎత్తయితే, దాన్ని తీవ్రంగా ద్వేషిస్తుండటం ఇంకో ఎత్తు! దీంతో బాలీవుడ్‌లోని స్టార్లు, స్టార్ కిడ్స్ ఆందోళనలో మునిగిపోయారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



