కాజల్ ప్రెగ్నెన్సీని కన్ఫామ్ చేసిన గౌతమ్!
on Jan 2, 2022
.webp)
అందాల తార కాజల్ అగర్వాల్ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు కొద్ది కాలంగా ప్రచారంలో ఉంది. అయితే ఇంతదాకా కాజల్ కానీ, ఆమె భర్త గౌతమ్ కిచ్లూ కానీ ఈ విషయమై మాట్లాడింది లేదు. ఫస్ట్ టైమ్ సోషల్ మీడియా ద్వారా గౌతమ్ తన ముద్దుల భార్య ప్రెగ్నెంట్ అయినట్లు ధ్రువీకరించాడు. కాజల్ ఫొటోను షేర్ చేసిన అతను, "Here’s looking at you 2022" అనే క్యాప్షన్ పెట్టి, దానికి బేబీ బంప్ ఎమోజీని జోడించాడు.
Also read: దీప్తి బ్రేకప్ పోస్టుకు షణ్ణు రిప్లై ఇదే!
కాజల్, గౌతమ్ 2020 అక్టోబర్‌లో ముంబైలో వివాహం చేసుకున్నారు. సుమారు రెండు నెలలుగా కాజల్ ప్రెగ్నెంట్ అయినట్లు వదంతులు వ్యాపించాయి. విదేశాలకు కుటుంబంతో కలిసి విహారయాత్రకు బయలుదేరిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో, నిజంగా ఆమె ప్రెగ్నెంటేనా అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. అయితే, చాలామంది మాత్రం కాజల్, ఆమె భర్త గౌతమ్ నుంచి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు.
Also read: ఒమిక్రాన్ ఎఫెక్ట్: హిందీ 'జెర్సీ' వాయిదా.. 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' సంగతేంటి?
ఈ జంట కొత్త సంవత్సరం సెలబ్రేట్ చేసుకోవడానికి దుబాయ్ వెళ్లారు. అక్కడి హార్బర్ ఏరియా నుంచి తమ ఇద్దరి ఫొటోను పోస్ట్ చేశాడు గౌతమ్. ఆ ఫొటోలో ఆకుపచ్చ గౌనులో స్టన్నింగ్ లుక్‌తో కనిపిస్తోంది కాజల్. ఇద్దరూ చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. ప్రస్తుత పాండమిక్ డేస్‌లో ప్రయాణ ఆంక్షలు లేని కొన్ని ప్రదేశాల్లో దుబాయ్ ఒకటి. అందుకే మహేశ్‌బాబు ఫ్యామిలీ సహా పలువురు సెలబ్రిటీలు ఇప్పుడు దుబాయ్‌లో కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
పని విషయానికి వస్తే, చిరంజీవి సరసన కాజల్ నాయికగా నటించిన 'ఆచార్య' మూవీ ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధమవుతోంది.
.webp)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



