ప్రాఫిట్ జోన్‌లో అడుగుపెట్టిన 'శ్యామ్ సింగ రాయ్'!
on Jan 2, 2022

నాని టైటిల్ రోల్ చేయగా, రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేసిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీ 9 రోజుల్లో బ్రేకీవెన్ సాధించి, ప్రాఫిట్ జోన్‌లో అడుగుపెట్టింది. ఐదో రోజు నుంచి ఎనిమిదో రోజు దాకా తెలుగునాట లక్షల్లోనే షేర్ రాబట్టిన ఈ మూవీ శనివారం తొమ్మిదో రోజు ఏకంగా రూ. 1.87 కోట్ల షేర్ సాధించి బయ్యర్లను ఆనందపరిచింది. సాయిపల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా వసూళ్లు 9 రోజులకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రూ. 17.17 కోట్ల షేర్‌కు చేరుకున్నాయి.
Also read: తెలంగాణలో రూ. 20 కోట్ల (షేర్)ను క్రాస్ చేసిన 'అఖండ'!
తెలంగాణలో శనివారం రూ. 97 లక్షలు వసూలు చేసిన 'శ్యామ్ సింగ రాయ్', ఆంధ్రాలో రూ. 57 లక్షలు , రాయలసీమలో రూ. 33 లక్షలు రాబట్టింది. దీంతో 9 రోజులకు తెలంగాణలో రూ. 8.69 కోట్లు, ఆంధ్రాలో రూ. 6.11 కోట్లు, రాయలసీమలో రూ. 2.37 కోట్ల షేర్‌ను ఈ మూవీ సాధించింది. దేశంలోని మిగతా ఏరియాల్లో రూ. 2.71 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.45 కోట్లు వచ్చాయి. వెరసి ప్రపంచవ్యాప్తంగా 'శ్యామ్ సింగ రాయ్' వసూళ్లు రూ. 23.33 కోట్లకు చేరుకున్నాయి.
Also read: బర్త్‌డే స్పెషల్ స్టోరీ: సౌత్ ఇండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో టాప్ టెన్ హిట్స్!
ఈ సినిమా ప్రి బిజినెస్ వాల్యూ రూ. 22 కోట్లు. సో.. 2021లో విడుదలైన చివరి క్రేజీ ఫిల్మ్ 'శ్యామ్ సింగ రాయ్' కూడా బ్రేకీవెన్ సాధించి, లాభాల్లోకి అడుగుపెట్టింది. కొవిడ్ భయాల మధ్య 2021లో పలు తెలుగు సినిమాలు లాభాలను చవిచూడటం విశేషమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



