పవన్ మూడో భార్యకి కూడా విడాకులివ్వబోతున్నాడా..?
on Feb 4, 2017

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్...విలక్షణ వ్యక్తిత్వంతో సినీ నటుడిగా కన్నా..మనసున్న మనిషిగా తన చేతల ద్వారా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి. మనిషి అన్నాకా బలహీనతలు సహజం..ఏ మనిషి వీటికి అతీతుడు కాదు. ఆ బలహీనతలు మనకు బలం కాక పోగా..ఎదుటి వ్యక్తికి ఆయుధంగా మారే అవకాశం కూడా ఉంది. పవన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ప్రత్యర్థులు..ఆయన్ను విమర్శించే వారికి దొరికిన ఆయుధం ఏమిటంటే..మూడు పెళ్లిళ్లు. ఈ విషయంపై ఎంతో మంది పవర్‌స్టార్‌ను విమర్శించారు.
అది ఆయన వ్యక్తిగత వ్యవహారం అయినప్పటికి పదే పదే బయటకు లాగుతూనే ఉంటారు. ఈ సంగతి పక్కనబెడితే పవన్ తన మూడో భార్య అన్నా లెజ్‌నోవాకి కూడా విడాకులు ఇవ్వబోతున్నాడని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు ఈ దంపతుల మధ్య ఎక్కడ చెడింది అని ఆరా తీస్తే..పవన్ ఈ మధ్య ఉద్దానం కిడ్నీ బాధితులను పరామర్శించి కొంతమందికి ఆర్థిక సహాయం చేసిన సంగతి తెలిసిందే.
ఎప్పటి నుంచో పవన్ చేస్తున్న పనులను చూస్తూ మారు మాట్లాడకుండా ఉన్న అన్నా..ఈ సారి మాత్రం భర్తను నిలదీసిందట. చేతికి ఎంత వస్తే అంత దానాలు, ధర్మాలు చేస్తే రేపు మన పరిస్థితి ఏంటి అని ప్రశ్నించేటప్పటికి పవన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడట. నేనింతే..నా ముందు ఎవరైనా బాధపడితే నేను చూడలేను...సాయం చేసే వరకు నిద్రపోను..నాతో ఉండాలనుకుంటే ఉండూ లేదంటూ వెళ్లిపో అని చెప్పటప్పటికి ఆమె తీవ్ర మనస్తాపానికి గురైందట..అప్పటి నుంచి ఈ జంట అన్యోన్యంగా ఉండటం లేదట. చూస్తూ ఉంటే పవన్-లెజ్‌నోవాలు ఏ క్షణమైనా విడిపోయే అవకాశం ఉందని ఫిలింనగర్ టాక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



