వినాయక చవితికి 'మాస్ జాతర'.. ఈసారి సౌండ్ మామూలగుండదు!
on May 29, 2025

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకుడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించి సినిమాపైఅంచనాలు ఏర్పడేలా చేసింది. తాజాగా నిర్మాతలు ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. (Mass Jathara)
'మాస్ జతర' చిత్రం వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న విడుదల కానుందని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ వింటేజ్ రవితేజ కనిపిస్తున్నాడు. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విధంగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఈ చిత్రాన్ని మలుస్తున్నారు.
'మాస్ జతర' చిత్రంలో శ్రీలీల కథానాయిక. ధమాకా తర్వాత వీరి కలయికలో వస్తున్న చిత్రమిది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగల్ 'తు మేరా లవర్' ఆకట్టుకుంది. సినిమాటోగ్రాఫర్ గా విధు అయ్యన్న, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.
మాస్ ఎంటర్టైనర్స్ కి రవితేజ పెట్టింది పేరు. మునుపటి రవితేజను గుర్తుచేసేలా, ఆయన అభిమానులకు, మాస్ ప్రేక్షకులను ఫుల్ ట్రీట్ ఇచ్చేలా 'మాస్ జాతర' ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



