కవిగా, రచయితగా పాపులర్ అవుతున్న జనార్దన మహర్షి!
on Feb 7, 2023

కవిగా, నవలా రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు సినీ రచయిత, దర్శకుడు జనార్దన మహర్షి. 2003లో వచ్చిన ఆయన తొలి ప్రచురణ 'వెన్నముద్దలు' అనే కవితా సంకలనం సాహితీ లోకంలో మంచి ప్రాచుర్యాన్ని పొందింది. ఇది ఇప్పటివరకు 12 ముద్రణలు పొందటం విశేషం.
2004లో 'పంచామృతాలు' అనే కథా సంకలనాన్ని ఆయన వెలువరించారు. ఇక ఆయన 2007లో ప్రచురించిన 'గుడి' నవల, తర్వాత కాలంలో చలనచిత్రంగా రూపొందింది. దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కె. విశ్వనాథ్ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఆ సినిమా 'దేవస్థానం'. 2012లో వచ్చిన ఈ మూవీకి జనార్దన మహర్షి స్వయంగా దర్శకత్వం వహించారు. 'గుడి' నవలను 'గర్భగుడిలోకి..' అనే సరికొత్త టైటిల్‌తో 2021లో పునర్ముద్రించారు జనార్దన మహర్షి. ఇది కన్నడంలోనూ అనువాదమైంది.
2008లో 'నాకు నేను రాసుకున్న ప్రేమలేఖ' అనే కవితాత్మక నవల, 2011లో 'కవిగానే కన్నుమూస్తా' అనే కవితా సంకలనం, 2019లో 'మధుర సంభాషణలు' అనే పుస్తకం, అదే సంవత్సరం 'చిదంబర రహస్యం' అనే కథా సంకలనం, 2021లో 'శ్మశానానికి వైరాగ్యం' అనే మరో కథా సంకలనం ఆయన నుంచి వచ్చాయి. చివరగా 2022లో 'జన'పదాలు అనే కవితా సంకలనాన్ని ఆయన ప్రచురించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



